సంసద్ రత్న అవార్డు అందుకున్న విజయసాయిరెడ్డి
25 Mar, 2023 16:29 IST
న్యూఢిల్లీ: ఢిల్లీలో శనివారం జరిగిన సంసద్ రత్న అవార్డుల ప్రదానోత్సవంలో పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్ హోదాలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ నుంచి ప్రతిష్టాత్మకమైన సంసద్ రత్న అవార్డును వైయస్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అందుకున్నారు.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ‘సన్‌సద్ రత్న’ అవార్డుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎంపికయ్యారు. విజయసాయిరెడ్డి ప్రస్తుతం రాజ్యసభ తరపున రవాణా, పర్యాటకం, సాంస్కృతిక వ్యవహారాల స్టాండింగ్ కమిటీకి అధ్యక్షత వహిస్తోన్న విషయం విదితమే.