వైయస్ జగన్ సీఎంగా మరో 25 ఏళ్లు ఉండాలని ఆశీర్వదించాలి
8 Jan, 2021 19:23 IST
విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి మహిళలకు చేస్తున్న కార్యక్రమాలు అనిర్వచనీయమని, ఇలాంటి ముఖ్యమంత్రి మరో 25 సంవత్సరాలు అధికారంలో ఉండాలని రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించాలని వైయస్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని భారతదేశంలో అతిపెద్ద కార్యక్రమంగా నిలిపినందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి విజయసాయిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం యలమంచిలిలో ఆయన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. సీఎం మహిళా పక్షపాతిగా నిరూపించుకుంటూ వారి ఉజ్వల భవిష్యత్తుకు తోడ్పడుతున్నారు. అవినీతి లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు అని విజయసాయిరెడ్డి అన్నారు.