‘జగనన్న అమ్మఒడి’  చరిత్రాత్మక పథకం

9 Jan, 2020 15:36 IST

అమరావతి: ‘జగనన్న అమ్మఒడి’  ఒక చరిత్రాత్మక పథకమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార‍్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి ప్రశంసించారు. ‘రాష్ట్రం సంపూర్ణ అక్షరాస్యత సాధించే దిశలో అమ్మ ఒడి దేశానికే దిక్సూచి అవుతుంది. 43 లక్షలమంది విద్యార్థుల తల్లులకు ఏటా 6,455 కోట్లు నేరుగా బ్యాంకు ఖాతాల ద్వారా అందించడం అసాధారణ విషయం. పిల్లలను స్కూల్‌కు పంపడం ఎవరికీ భారం అనిపించదు’ అని ఆయన గురువారం ఈ మేరకు ట్వీట్‌ చేశారు.