విడపనకల్లులో టీడీపీకి ఎదురుదెబ్బ
ఉరవకొండ: ఉరవకొండ నియోజకవర్గంలో ప్రతిపక్ష టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. విడపనకల్లు మండల కేంద్రంలోని టీడీపీ నేతలు, కార్యకర్తలు అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే, వైయస్ఆర్ సీపీ ఇన్‌చార్జ్ విశ్వేశ్వరరెడ్డి సమక్షంలో టీడీపీ నేతలు భారీగా వైయస్ఆర్ సీపీలో చేరారు. ఈ మేరకు వారికి మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయస్ జగన్ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పలువురు వైయస్ఆర్ సీపీలో చేరుతున్నారన్నారు. పార్టీ లోకి చేరిన వారు పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ బసన్న, జెడ్పీటీసీ హనుమంతు, మాజీ జెడ్పీటీసీ తిప్పయ్య, నాయకులు కరణం భీమరెడ్డి, హవలిగి భరత్ రెడ్డి, విడపనకల్లు సుంకన్న, దేశాయి సిద్దు, గిరిబాబు,మండల కో అప్షన్ సభ్యుడు లతీఫ్, ఆర్. కొట్టాల సర్పంచ్ జయసింహ, విడపనకల్లు పిఏసీఎస్ చైర్మన్ శ్రీరాములు, టీ. వీరన్న,బెస్త ఎర్రిస్వామి, లింగన్న, ఉమాశంకర్, ఓబులేసు, ఉరవకొండ ఎంపీపీ చందా చంద్రమ్మ, వైస్ ఎంపీపీ నరసింహులు, పట్టణ కన్వీనర్ బ్యాంక్ ఓబులేసు,కురుబ, ఎంబిసి కార్పొరేషన్ల డైరెక్టర్లు గోవిందు, జోగి వెంకటేష్, ఉప సర్పంచ్ వన్నప్ప,వక్ఫ్ బోర్డు మెంబర్ మీరంబాషా,ఉరవకొండ పిఏసీఎస్ చైర్మన్ వడ్ల షేక్షావలి, ఓబన్న, రాకెట్ల అశోక్ కుమార్, చాబల నారాయనప్ప, చాబాల సర్పంచ్ మల్లెల జగదీష్, ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు.