కలలో కూడా ఊహించలేదు

10 Apr, 2022 19:07 IST

 
గుంటూరు:  రాజ‌కీయాల్లో ఉన్నంత వ‌ర‌కు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ వెంటే న‌డుస్తాన‌ని విడ‌ద‌ల ర‌జిని పేర్కొన్నారు. సీఎం వైయ‌స్ జగన్ ఓ సాధారణ బీసీ మహిళనైన తనను ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం కల్పించారని, ఇప్పుడు మంత్రిగా అవకాశం ఇచ్చారని ఆమె సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తొలిసారి ఎమ్మెల్యే అయిన తనకు తాజాగా మంత్రి బాధ్యతలు అప్పగించారని, సీఎం వైయ‌స్ జగన్ నమ్మకాన్ని వమ్ము చేయనని రజని స్పష్టం చేశారు.   ప్రతి అంశంలోనూ తనను ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. మంత్రి పదవి దక్కుతుందని కలలో కూడా ఊహించలేదని అన్నారు. సీఎం వైయ‌స్‌ జగన్ సర్ ప్రైజ్ చేశారని తెలిపారు.