వ్యక్తిత్వ హననం చేస్తారా?..
31 Oct, 2024 12:10 IST
గుంటూరు : వ్యక్తిత్వ హననానికి పాల్పడేలా పోస్టింగ్స్ పెడుతున్న వారిపై మాజీ మంత్రి విడదల రజిని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు గుంటూరు జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిరణ్ అనే యాంకర్‌తో పాటు, మరో రెండు యూట్యూబ్ ఛానెల్ నిర్వహకులు తన గురించి అసభ్యకర పోస్టింగ్స్, వీడియోలు పెడుతున్నారని పోలీసుల ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లా పోలీసులతో పాటు జాతీయ మహిళా కమిషన్, ఏపీ మహిళా కమీషన్, డీజీపీలకు విడదల రజిని ఫిర్యాదు చేశారు.