వెన్నపూస రవీంద్రారెడ్డి ఆధిక్యం
అనంతపురం: పశ్చిమ రాయలసీమ (ఉమ్మడి అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలు) పట్టభద్రుల స్థానం నుంచి వైయస్ఆర్ సీపీ తరఫున పోటీ చేసిన వెన్నపూస రవీంద్రారెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఓట్ల లెక్కింపు మొదలు 3వ రౌండ్ తప్ప మిగతా ఐదు రౌండ్లు వెన్నపూస రవీంద్రారెడ్డి ఆధిక్యంలో కొనసాగారు. గురువారం అర్ధరాత్రి 2 గంటల సమయానికి రెండు రౌండ్ల ఫలితాలు పూర్తికాగా వెన్నపూస రవీంద్రారెడ్డి 19,519 ఓట్లతో కొనసాగారు. ఇవాళ ఉదయం నుంచి మిగతా ఓట్లు లెక్కించగా రవీంద్రారెడ్డికి 56,110 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డికి 54,091 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. 6వ రౌండ్ పూర్తి అయిన తరువాత 1,44,031 ఓట్ల లెక్కించారు. అందులో మొత్తం చెల్లిన (వాలీడ్) ఓట్లు : 1,32,859, చెల్లని (ఇన్ వాలీడ్) ఓట్లు : 11,172 ఉన్నాయి. వెన్నపూస రవీంద్రారెడ్డి అధిక్యంలో కొనసాగుతుండటంతో వైయస్ఆర్‌సీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.