`కూటమి`లో నో స్కిమ్స్.. ఓన్లీ స్కామ్స్
నెల్లూరు జిల్లా: వాలంటీర్లకి పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తున్నామని, వారిని జగనన్న పర్సనల్ సైన్యంగా తీర్చిదిద్దుతామని వెంకటగిరి నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ ఇన్‌చార్జి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. నాయకులకు, వాలంటీర్లకు మధ్య గ్యాప్ ఉంటే దాన్ని తొలగిస్తామన్నారు. శనివారం నెల్లూరులో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. `కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాష్ట్రంలో అరాచకాలు ఎక్కువయ్యాయి. నో స్కిమ్స్.. ఓన్లీ స్కామ్స్ అన్నట్లుగా పాలన వుంది. వెంకటగిరి నియోజకవర్గంలో అక్రమాలు తారా స్థాయికి చేరాయి. ఇసుక అక్రమ రవాణా యధేచ్చగా జరుగుతుంది. అనధికార రీచ్ లకు రోడ్లు కూడా వేశారు. ప్రభుత్వం ఉందా.. పాలన సాగుతుందా అనే అనుమానం ప్రజల్లో కల్గుతుంది. సైదాపురంలోని క్వార్జ్ కూడా దర్జాగా అక్రమ రవాణా చేస్తున్నారు. మైన్స్ ఓనర్స్ ని బెదిరించి.. 50 శాతం వాటాను మాఫియా లాక్కుంటుంది. ఇష్టారాజ్యాంగంగా మైన్స్ లో బ్లాస్ట్ చేస్తూ.. దోచుకుంటున్నారు. మైనింగ్ మాఫియా ఓ ప్రవేట్ కంపెనీని స్థాపించి నలుగురు డైరెక్టర్స్ ని ఏర్పాటు చేసుకుంది. విజిలెన్స్, మైనింగ్ అధికారులు మాఫియాకి తొత్తులుగా పనిచేస్తున్నారు. మండలంలో ఉన్న అన్నీ క్వారీల్లో ఇల్లీగల్ గా పనులు జరుగుతున్నాయి. అక్రమ మైనింగ్ మీద డిప్యూటీ సీఎం పవన్ దృష్టి పెట్టాలి.. మైన్స్ విజిట్ చేసి.. అక్రమాలను బయట తియ్యాలి. ఈ వ్యవహారంలో ఆల్ పార్టీస్ తో కలిసి ఎస్పీని కలిసి ఫిర్యాదు చేస్తాం` నెదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు.