శ్రీకాళహస్తీశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు సీఎం వైయస్ జగన్‌కు ఆహ్వానం
25 Feb, 2022 17:18 IST
తాడేపల్లి: రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన రెడ్డి, ఈవో కృష్ణారెడ్డి శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో కలిశారు. శ్రీకాళహస్తీశ్వరస్వామి వారి దేవస్ధానం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాల్సిందిగా సీఎం వైయస్ జగన్‌ను వారు ఆహ్వానించారు. ఆలయ అర్చకులు సీఎం వైయస్ జగన్‌కు.. వేద ఆశీర్వచనం ఇచ్చి, స్వామి వారి ప్రసాదాలను, చిత్రపటాన్ని అందజేశారు. ముఖ్యమంత్రికి స్వామి వారి శేషవస్త్రం, తీర్ధప్రసాదాలు, క్యాలెండర్ అందజేసి వేద పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చారు.