టీడీపీ పతనమే వంగవీటి రంగా ఆశయం
11 May, 2024 12:54 IST
విజయవాడ: టీడీపీ పతనమే వంగవీటి రంగ ఆశయమని రాధా-రంగా మిత్ర మండలి రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర పేర్కొన్నారు. వంగవీటి రాధా టీడీపీలో చేరి తండ్రి ఆశయాలను నీరు గార్చారని విమర్శించారు. శనివారం వంగవీటి నరేంద్ర మీడియాతో మాట్లాడారు.
రాధా-రంగా మిత్ర మండలి రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర ఏమన్నారంటే..
- వైయస్ఆర్, వంగవీటి ఫ్యామిలీల మధ్య కొన్ని దశాబ్దాలుగా మంచి సంబంధాలు ఉన్నాయి
- కానీ వంగవీటి రాధా టీడీపీలో చేరి సీఎం జగన్‌ను విమర్శించటం కరెక్టు కాదు
- 2014లో రాధాకు సీటు ఇస్తే ఓడిపోయాడు.
- 2019లో వేరే సీటు ఇస్తానని జగన్ చెప్తే కాదని పార్టీ మారాడు
- అంతకుముందు వరకు నా తండ్రిని చంపినది టీడీపీ వారే అని చెప్పాడు
- ఇప్పుడేమో మాట మార్చి మాట్లాడుతున్నారు
- వంగవీటి రంగా త్యాగాన్ని టీడీపీకి తాకట్టు పెట్టారు
- రంగా ఆశయం టీడీపీ పతనం
- కానీ రాధా మాత్రం అదే టీడీపీలో చేరి తండ్రి ఆశయాలను నీరు గార్చారు
- పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాధాని అడ్డం పెట్టుకుని చంద్రబాబుకు ఓట్లు వేయిస్తున్నారు
- ఇంతకంటే సిగ్గుమాలిన రాజకీయం ఉంటుందా?
- వైయస్ఆర్‌సీపీకి చెందిన కాపు మహిళలపై కమ్మ నేతలు దాడి చేస్తే పవన్ ఎందుకు మాట్లాడలేదు?
- తెనాలిలో గీతాంజలి చావుకు కారణమైన టీడీపీ వారిని పవన్ ఎందుకు ప్రశ్నించలేదు?
- జనసేనలో వీర మహిళలకు ఒక్క సీటు కూడా ఎందుకు ఇవ్వలేదు?
- వీర మహిళలు, జనసేన కార్యకర్తలు ఒకసారి ఆలోచన చేయాలి
- జనసేనని చంద్రబాబుకు తాకట్టు పెట్టిన పవన్‌ని గట్టిగా ప్రశ్నించాలి
- ధవళేశ్వరం బ్యారేజ్ కట్టించిన కాటన్ దొరని ప్రజలు ఇప్పటికీ పూజలు చేస్తున్నారు
- మరి హైదరాబాద్‌ని కట్టించానని చెప్పుకునే చంద్రబాబును ప్రజలు ఎందుకు పట్టించుకోలేదు?
- ఎందుకంటే.. చంద్రబాబు పచ్చి మోసగాడు, అబద్దాల కోరు అని తెలుసు కాబట్టే
- జగన్ ప్రజలకు మేలు చేసినందునే ఆయన్ను గుండెల్లో పెట్టుకున్నారు