వైయస్ జగన్ నాయకత్వంలో అన్నివర్గాలకు మేలు
హైదరాబాద్: వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోనే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని తూర్పుగోదావరికి చెందిన సీనియర్ నేత వంగా గీతా పేర్కొన్నారు. కొద్దిసేపటి క్రితం ఆమె వైయస్ జగన్ సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు.ఈ సందర్భంగా ఆమెకు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.వైయస్ జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వంగా గీతా అన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేలు జరుగుతుందన్నారు.యువత,మహిళలు,రైతులకు అందరికి న్యాయం జరుగుతుందన్నారు.రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి అహర్నిశలు శ్రమిస్తున్న వైయస్ జగన్‌మోహన్ రెడ్డి బాటలో నడవడానికి సంతోషంగా ఉందన్నారు.వైయస్‌ఆర్‌సీపీ పార్టీ ద్వారా ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.నవరత్న ,మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాల ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. టీడీపీ పాలనలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.వైయస్ జగన్‌మోహన్ రెడ్డి సీఎం అయితే అందరికి న్యాయం జరుగుతుందని అన్నివర్గాల ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారని తెలిపారు.కులమతాలకు అతీతంగా ప్రజలందరూ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని సిద్ధంగా ఉన్నారని తెలిపారు.