వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు..

19 Mar, 2026 10:08 IST

 తాడేపల్లి: వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శ్రీపరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేద పండితుల మంత్రోచ్ఛారణ మధ్య ప్రారంభమైన ఈ వేడుకల్లో వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, వైయ‌స్‌ భారతి దంపతులు పాల్గొన్నారు. సాంప్రదాయ పంచకట్టులో వైయ‌స్ జ‌గ‌న్ హాజ‌ర‌య్యారు. పిడపర్తి భాస్కర సుబ్రమణ్యేశ్వర శాస్త్రి పంచాంగ శ్రవణం కొనసాగుతోంది. ఉగాది వేడుకల్లో వైయ‌స్‌ జగన్‌ దంపతులతో పాటు, వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు పాల్గొన్నారు. 

ugadi Festivities at YSRCP Central Office with YS Jagan and Family