వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు
2 Apr, 2022 12:56 IST
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకులు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేరుగు నాగార్జున, నవరత్నాలు కార్యక్రమం ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్‌గా అంకంరెడ్డి నారాయణమూర్తి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.