రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు
22 Mar, 2023 09:51 IST
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు బుధవారం సీఎం వైయస్ జగన్ ట్వీట్ చేశారు. శోభకృత్ నామ సంవత్సరంలో అన్నీ శుభాలు జరగాలని, రైతులకు మేలు కలగాలని, నా అక్కచెల్లెమ్మలు ఆనందంగా ఉండాలని, సకల వృత్తుల వారు సంతోషంగా ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ ముఖ్యమంత్రి ట్వీట్లో పేర్కొన్నారు.