సీఎం వైయస్ జగన్‌కు వేద ఆశీర్వచనం
1 Jan, 2023 13:55 IST
తాడేపల్లి: నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి నివాసంలో సీఎం వైయస్ జగన్‌ను తిరుమల తిరుపతి దేవస్థానం, విజయవాడ శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వేద పండితులు వేద మంత్రోచ్ఛారణతో ఆశీర్వదించారు. అనంతరం సీఎం వైయస్ జగన్‌కు తీర్థ ప్రసాదాలు అందజేశారు. నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు వేద ఆశీర్వచనం ఇచ్చిన అనంతరం స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలను, టీటీడీ క్యాలెండర్, డైరీలను టీటీడీ అర్చకులు అందించారు. అనంతరం ముఖ్యమంత్రి వైయస్.జగన్‌కు డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, దేవాదాయశాఖ కమిషనర్ హరి జవహర్‌లాల్, శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్ధానం ఈవో భ్రమరాంభ, ఇతర అధికారులు సీఎం వైయస్ జగన్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.