సీఎం వైయస్ జగన్‌ను కలిసిన టీటీడీ బోర్డు మెంబర్ మిలింద్ కే.నర్వేకర్
6 Oct, 2021 18:59 IST
తాడేపల్లి: ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్ జగన్‌ను టీటీడీ బోర్డ్ మెంబర్ మిలింద్ కే. నర్వేకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. టీటీడీ పాలకమండలి సభ్యుడిగా నియమించినందుకు ముఖ్యమంత్రిని మిలింద్ కే.నర్వేకర్, కుటుంబ సభ్యులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సీఎం వైయస్ జగన్‌ను మహారాష్ట్ర శివసేన సెక్రటరీ సూరజ్ చవాన్ కలిశారు.