నూతన గవర్నర్‌ను కలిసిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
25 Feb, 2023 07:51 IST
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ దంపతులను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ దంపతులను కలిసి తిరుమల శ్రీవారి ప్రసాదాలను అందించి ఘనంగా సత్కరించారు. ఏపీ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టినందుకు శుభాకాంక్షలు తెలిపారు.