వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు
తిరుమల: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సంప్రదాయబద్ధంగా వైభవంగా జరుగుతున్నాయని తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. కరోనా నిబంధనల మేరకు ఈ ఏడాది కూడా ఏకాంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. బ్రహ్మోత్సవాల్లో 5వ రోజు స్వామివారు మోహిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారన్నారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రాధాన్యమైన గరుడ సేవ సందర్భంగా ఈ రోజు సాయంత్రం ఏపీ ప్రజల తరఫున సీఎం వైయస్ జగన్ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారన్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాటు పూర్తిచేశామన్నారు. తిరుమలలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, కొండ కింద భక్తులు, ప్రజల కోసం ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి వైయస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభించుకొని ప్రజలకు, భక్తులకు అంకితం చేస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.