వచ్చే ఏడాది కల్లా గరుడ వారధి ఫ్లై ఓవర్ పనులు పూర్తి
31 Jul, 2020 11:12 IST
తిరుమల: గరుడ వారధి ఫ్లై ఓవర్ బ్రిడ్జి పనులు వేగంగా జరుగుతున్నాయని, వచ్చే ఏడాది కల్లా పనులు పూర్తి అవుతాయని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. గరుడ వారధి పనులు పూర్తిఅయితే తిరుపతి వాసులకు ట్రాఫిక్ కష్టాలు తొలగిపోతాయని చెప్పారు. తిరుమల అర్చకులు కరోనా నుంచి కోలుకున్నారని సుబ్బారెడ్డి తెలిపారు. ఇప్పట్లో భక్తుల దర్శనాల సంఖ్య పెంచే ఆలోచన లేదని స్పష్టం చేశారు. 12వేలటికెట్లు ఆన్‌లైన్‌లో ఉంచితే 9 వేలు మాత్రమే బుక్ అవుతున్నాయని వివరించారు. 1వ తేదీ తరువాత కేంద్రం సూచనల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొన్నారు.