బాలాజీ రిజర్వాయర్ నిర్మాణానికి టీటీడీ బోర్డు ఆమోదం
23 Sep, 2019 14:07 IST
తిరుమల: బాలాజీ రిజర్వాయర్ నిర్మాణానికి టీటీడీ బోర్డు ఆమోదం తెలిపింది. టీటీడీ నూతన పాలక మండలి తొలి సమావేశం వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన నిర్వహించగా పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. గత ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వాటిని ఆమోదించామని చైర్మన్ తెలిపారు. భక్తులకు నీటి సమస్యలు లేకుండా చూస్తామని ఆయన పేర్కొన్నారు.