రైతులకు అండగా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి

8 Sep, 2021 13:03 IST

వైయస్‌ఆర్‌ జిల్లా:  రైతులకు అండగా ప్రొద్దుటూరు వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి నిలిచారు. రూ.2 కోట్లతో నియోజకవర్గం రైతులకు 23 ట్రాక్టర్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. 23 రైతు భరోసా కేంద్రాలకు 23 ట్రాక్టర్లను ఎమ్మెల్యే అప్పగించారు. ప్రొద్దుటూరు వైయస్‌ఆర్‌ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో మంత్రి కన్నబాబు, ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి గొప్ప కార్యక్రమం చేపట్టారని అన్నారు. ఆయన ఎమ్మెల్యే కాకముందు నుంచి తన నియోజక ప్రజలకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నారని కొనియాడారు. మరో వైపు రాష్ట్ర​ ప్రభుత్వం విద్య , వైద్యం , వ్యవసాయ రంగంలో అనేక విప్లవాత్మక చర్యలు చేపట్టిందని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తరహాలో తండ్రికి తగ్గ తనయుడిగా నిర్ణయాలు, సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్నారన్నారు. రైతాంగానికి అండగా రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందని, వారి కోసం డ్రిప్ ఇరిగేషన్ త్వరగా అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.

చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. లోకేష్ రాబందులాగా శవాల కోసం ఏడురుచూస్తున్నాడని, రాష్ట్రంలో  ఎక్కడ శవం కనిపించినా అక్కడ వాలిపోయి ప్రభుత్వాన్ని నిందించడమే పనిగా పెట్టుకున్నాడంటూ విమర్శించారు.