రేపు “చలో జువ్వలదిన్నె” 

19 Mar, 2026 14:31 IST

నెల్లూరు జిల్లా : కావలి నియోజకవర్గంలో మత్స్యకారుల హక్కుల పరిరక్షణ కోసం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 20వ తేదీ(శుక్ర‌వారం) “చలో జువ్వలదిన్నె” కార్యక్రమానికి పిలుపునిచ్చింది. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్ర‌తాప్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో రేపు జువ్వ‌ల‌దిన్నె ను సంద‌ర్శించ‌నున్నారు. మత్స్యకారుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే సహించబోమని పార్టీ నేతలు హెచ్చరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ ఇంచార్జ్ కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి  పాల్గొననున్నట్లు సమాచారం. అలాగే కాటంరెడ్డి విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి సహా పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరుకానున్నారు. మత్స్యకారుల హక్కుల సాధన కోసం జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.