రేపటి నుంచి రాజన్న బడిబాట

11 Jun, 2019 11:31 IST

అమరావతి:విద్యను వ్యాపారం చేస్తే సహించమని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ హెచ్చరించారు.ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ విద్యా సంస్కరణల కోసం నూతన విద్య విధానాన్ని రూపొందిస్తామని తెలిపారు.  రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రాజన్న బడిబాట నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 100 శాతం పిల్లల స్కూళ్లలో చేరేలా  చర్యలు తీసుకుంటామన్నారు. ప్రైవేట్‌ స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు కమిటీ వేస్తున్నట్లు వెల్లడించారు. 2019 నుంచి 2024 వరుకు చేయబోయే మార్పులతో నూతన పాలసీ తీసుకువస్తున్నట్లు తెలిపారు. జనవరి 26 నుంచి అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. సీఎం వైయస్‌ జగన్‌ తొలి కేబినెట్‌  నిర్ణయాలతోనే విద్యా విధానంలోని సంస్కరణలు మొదలయ్యాయని తెలిపారు.