రేపు పులివెందులకు వైయస్ జగన్
27 May, 2019 14:21 IST
తాడేపల్లి: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీకి కాబోయే సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం వైయస్‌ఆర్ జిల్లాకు వెళ్లనున్నారు. రేపు ఉదయం తాడేపల్లి నుంచి పులివెందుల చేరుకొని ఇడుపులపాయలో తన తండ్రి దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించనున్నారు. అదేరోజు సాయంత్రం వైయస్ జగన్ తిరుపతి వెళ్లనున్నారు. రాత్రి తిరుమలలో బస చేసి ఎల్లుండి బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.