నేడు గుంటూరు జిల్లాలో సీఎం పర్యటన
14 Jun, 2019 10:24 IST
అమరావతి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాజన్న బడిబాట కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. తాడేపల్లి మండలం పెనుమాక జెడ్పీ హైస్కూల్లో 2 వేల మంది చిన్నారులకు ఏర్పాటుచేసిన సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు.