నేడు విశాఖకు సీఎం వైయస్ జగన్
20 Feb, 2022 14:47 IST
విశాఖపట్నం: ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం విశాఖలో పర్యటించనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విశాఖ చేరుకుంటారు. ఆయనకు ఆహ్వానం పలికేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సాయంత్రం 4.45 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ఐఎన్‌ఎస్ డేగాలో రాష్ట్రపతికి స్వాగతం పలికిన తరువాత సాయంత్రం 5.55 గంటకు సీఎం తిరుగు పయనమవుతారు.