పశ్చిమగోదావరి జిల్లాకు బయలుదేరిన సీఎం వైయస్‌ జగన్‌

20 Jun, 2019 11:16 IST

అమరావతి: తాడేపల్లి నుంచి పశ్చిమగోదావరి సీఎం  వైయస్‌ జగన్‌ బయలుదేరారు. కాసేపట్లో ఉండి చేరుకోనున్నారు. ఉండిలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేత కొయ్యే మోషేన్‌రాజు కుమారుడి వివాహానికి హాజరుకానున్నారు.అనంతరం 11.25 గంటలకు పోలవరం చేరుకోనున్నారు.సీఎం హోదాలో తొలిసారి పోలవరం సందర్శించనున్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ పనుల పరిశీలించి అధికారులు,కాంట్రాక్టర్లతో సమావేశం కానున్నారు.