టీటీడీ గోశాల విషయంలో భూమన చెప్పిన మాటలు యధార్థం
తిరుపతి: తిరుపతి తిరుమల దేవస్థానం గోశాలలో గోవుల మరణాలపై వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చెప్పిన మాటలు యధార్థమని ఎంపీ గురుమూర్తి స్పష్టం చేశారు. తిరుమలలో ప్రధాన పూజలు అందుకొనే గోవు.. దూడలు, ఎద్దు మృతి చెందాయని, గోవుల సంరక్షణ విషయంలో టీటీడీ పాలక మండలి విఫలమైందన్నారు. సాక్షాత్తు సీఎం చంద్రబాబు ఎదుటే ఈఓ, చైర్మన్ వాదులాడుకున్నారని గుర్తు చేశారు. భూమన హిందూవో... నాస్తికుడో ...ఆయన ఇంటికెళ్లి చూస్తే తెలుస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా ప్రతిపక్షంపై దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. భూమనపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామంటూ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు బెదిరింపులకు దిగడం సరికాదన్నారు. టీటీడీలో జరుగుతున్న అన్నింటి పైనా అఖిల పక్షం వేసి విచారణ జరపాలని వైయస్ఆర్‌సీపీ తరఫున గురుమూర్తి డిమాండ్ చేశారు. టీటీడీలో భద్రతాలోపం వైఫల్యాలపై కేంద్రం జోక్యం చేసుకోవాలని ఎంపీ కోరారు.