సీఎంను కలిసిన తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుమూర్తి
17 Mar, 2021 15:45 IST
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన గురుమూర్తి.. తనకు ఎంపీగా పోటీచేసే అవకాశం ఇచ్చినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం గురుమూర్తికి సీఎం వైయస్ జగన్ ఆల్ ది బెస్ట్ చెప్పారు.