మూడు ప్రాంతాల అభివృద్ధికి 3 రాజధానులే మార్గం
5 Feb, 2023 18:44 IST
తిరుమల: రాష్ట్రంలోని మూడు ప్రాంతాల అభివృద్ధికి 3 రాజధానులే మార్గమని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహా రాలు) సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం సజ్జల రామకృష్ణారెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నా...విభజన సమయంలో ఏపీకి అన్యాయం జరిగింది.ప్రత్యేక హోదా ఇతర ప్రయోజనాలు రాష్ట్రానికి రావాలని కోరుకున్నట్లు తెలిపారు.