వైయస్ జగన్‌కు ఒడిశా సీఎం ధన్యవాదాలు
2 May, 2020 12:13 IST
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ధన్యవాదాలు తెలిపారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన వలస కూలీలు, కార్మికులకు ఏపీ ప్రభుత్వం అన్ని వసతులు కల్పించడం పట్ల ఆ రాష్ట్ర సీఎం వైయస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. శనివారం ఉదయం కేంద్ర మంత్రి ధర్మెంద్ర ప్రధాన్ ఒడిశా, ఏపీ సీఎంలతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడి వలస కూలీల తరలింపుపై చర్చించారు. ఏపీలో చిక్కుకున్న ఒడిషా రాష్ట్రానికి చెందిన కూలీలకు, కార్మికులకు ఇక్కడి ప్రభుత్వం వసతి, భోజన ఏర్పాట్లు చేయడం పట్ల ఆ రాష్ట్ర సీఎం వైయస్ జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు.