సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు ఆర్య‌వైశ్యుల కృత‌జ్ఞ‌త‌లు

21 Jan, 2022 16:23 IST

అమ‌రావ‌తి:  సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డిని ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు క‌లిసి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. వైశ్యులను కించపరిచే విధంగా ఉన్న చింతామణి నాటక ప్రదర్శనను నిషేదించాలన్న ఆర్యవైశ్యుల విజ్ఞప్తి మేరకు ఇటీవల ఏపీ ప్రభుత్వం ఆ నాట‌కాన్ని నిషేదించింది. ముఖ్య‌మంత్రి నిర్ణ‌యం ప‌ట్ల ఆర్య‌వైశ్యులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.  
సీఎంని కలిసిన వారిలో దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు ముక్కాల ద్వారకానాథ్, ఆర్యవైశ్య వెల్ఫేర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కుప్పం ప్రసాద్, ఆర్టీఐ కమిషనర్‌ రేపాల శ్రీనివాసరావు ఉన్నారు.