థ్యాంక్యూ సీఎం స‌ర్‌..

17 Jun, 2022 15:35 IST

తాడేప‌ల్లి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేయడంతో ముఖ్యమంత్రికి ఆంధ్రప్రదేశ్‌ గ్రామ, వార్డు సచివాలయాల ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైయ‌స్‌ జగన్‌ను ఆంధ్రప్రదేశ్‌ గ్రామ, వార్డు సచివాలయాల ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు శుక్ర‌వారం క‌లిశారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేయడంతో హ‌ర్షం వ్య‌క్తం చేశారు.  ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి, ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు భీమిరెడ్డి అంజన్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బత్తుల అంకమరావు, రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్స్‌ విప్పర్తి నిఖిల్‌కృష్ణ, భార్గవ్‌ సుతేజ్, అదనపు ప్రధాన కార్యదర్శి బిఆర్‌ఆర్‌.కిశోర్, ముఖ్యమంత్రి సలహాదారు (గ్రామ, వార్డు సచివాలయాలు, స్పందన కార్యక్రమం) ఆర్‌. ధనంజయ రెడ్డి ఉన్నారు.