పదో తరగతి పరీక్షలు వాయిదా
24 Mar, 2020 12:11 IST
సచివాలయం: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. ఈ నెల 31వ తేదీ నుంచి జరగాల్సిన టెన్త్ పరీక్షలను రెండు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. 31 తర్వాత పరీక్షల తేదీలను ప్రకటిస్తామని మంత్రి చెప్పారు.