ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు
విజయవాడ: వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు వేంకట రామమూర్తిగారి జయంతిని పురస్కరించుకుని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ లో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో మంత్రి ఆదిమూలపు సురేష్, ఏపీ సాహిత్యా అకాడమీ చైర్ పర్సన్ ఎన్.లక్ష్మీపార్వతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిడుగు వెంకట రామమూర్తి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలుగు భాషా అభ్యున్నతికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. గిడుగు వారు అప్పటి మద్రాసు ప్రావిన్సులోని పూర్వపు గంజాం జిల్లాకీ, ఇప్పటి శ్రీకాకుళం జిల్లాకి చెందిన పర్వతాల పేట గ్రామంలో జన్మించారు. 1880లో పర్లాకిమిడి సంస్థానంలో ఉపాధ్యాయుడిగా వృత్తి జీవితం మొదలుపెట్టారు. అప్పటినుంచి 1911 దాకా పర్లాకిమిడి సంస్థానంలో విద్యకి సంబంధించిన వివిధ బాధ్యతలు నెరవేర్చారు. గిడుగు జీవితకాలంలో చేపట్టిన కృషి ఎన్నో శాఖలకు విస్తరించిందని కొనియాడారు.