వైయస్ జగన్‌ను కలిసిన తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

3 Mar, 2026 16:36 IST

తాడేప‌ల్లి: మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధినేత శ్రీ వైయస్‌ జగన్ మోహ‌న్ రెడ్డి గారిని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన కుమారుడి వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను వైయస్ జగన్‌కు అందజేసి, వివాహ వేడుకకు హాజరై ఆశీర్వదించాలని భట్టి విక్రమార్క కోరారు. వైయస్ జగన్ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వధూవరులకు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో నిండైన దాంపత్య జీవితం గడపాలని ఆకాంక్షించారు.