వైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సరళాదేవి
18 Jan, 2023 15:48 IST

తాడేపల్లి: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వావిలాల సరళాదేవి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ చేనేత ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ వావిలాల సరళాదేవి, ఆమె భర్త వావిలాల వెంకట రమేష్ వైయస్ఆర్ సీపీలో చేరారు. ఈ మేరకు సీఎం వైయస్ జగన్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పాల్గొన్నారు.