అనంతపురంలో దళిత మహిళను దూషించిన టీడీపీ నేతలు
14 Apr, 2026 11:20 IST
అనంతపురం: అంబేద్కర్ జయంతి సందర్భంగా టీడీపీ నేతలు రెచ్చిపోయారు. అనంతపురంలో డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద పూలమాలలు వేసేందుకు వెళ్లిన వైయస్ఆర్‌సీపీ నేతలను టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఏపీఎస్ఆర్టీసీ రీజినల్ మాజీ చైర్మన్, వైయస్ఆర్‌సీపీ దళిత మహిళా నేత మంజులను టీడీపీ నేతలు అసభ్య పదజాలంతో దూషించారు. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన మంజుల కంటతడి పెట్టారు. టీడీపీ నేతల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైయస్ఆర్‌సీపీ నాయకులు ఘటనపై నిరసన తెలిపారు. దళిత మహిళను అవమానించడం అన్యాయమని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.