తాడిపత్రి లో టీడీపీ నేత జేసీ వర్గీయుల దాష్టీకం
అనంతపురం: తాడిపత్రిలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గీయుల అరాచకాలకు అంతు లేకుండా పోయింది. వైయస్ఆర్‌సీపీ కార్యకర్త రామకృష్ణ, రేవతి కిరాణా షాపును జేసీ అనుచరులు ధ్వంసం చేశారు. ‘ఈ రోజు నీ దగ్గరకు వచ్చిన వైయస్ఆర్‌సీపీ నాయకులను, కార్యకర్తలను రప్పా.. రప్పాలాడిస్తాం. చేతనైతే కాపాడుకో కేతిరెడ్డీ’ అంటూ టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్‌పర్సన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి నిన్న రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. 24 గంటలు గడవకముందే టీడీపీ శ్రేణులు రెచ్చిపోయారు. వైయస్ఆర్‌సీపీకి మద్దతు ఇస్తున్నారని పోరాట కాలనీకి చెందిన రామకృష్ణ, రేవతి ఇళ్లపై దాడికి తెగబడ్డారు. సంఘటన స్థలాన్ని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ రెడ్డి, తదితరులు పరిశీలించి, బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. పట్టపగలే దాడులకు పాల్పడిన టీడీపీ నేతలపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు.