టీడీపీ నేత జియావుద్దీన్ వైయస్ఆర్ సీపీలో చేరిక
20 Jul, 2021 17:18 IST
తాడేపల్లి: టీడీపీ సీనియర్ నేత, గుంటూరు తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఎస్.ఎం.జియావుద్దీన్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ మేరకు సీఎం వైయస్ జగన్.. జియావుద్దీన్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా షేక్, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.