పుంగనూరులో రెచ్చిపోయిన ‘పచ్చ’మూకలు
18 Jul, 2024 12:14 IST
చిత్తూరు: టీడీపీ అరాచకాలకు అడ్డూ, అదుపు లేకుండా పోతోంది. పుంగనూరులో ఎంపీ మిథున్‌రెడ్డిపై టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయి. మాజీ ఎంపీ రెడప్ప నివాసానికి మిథున్‌రెడ్డి రాగా.. రెడ్డప్ప ఇంటిపై టీడీపీ శ్రేణులు రాళ్లదాడికి దిగాయి.
టీడీపీ దాడిలో గాయపడ్డ నేతలతో మిథున్‌రెడ్డి సమావేశం జరుగుతుండగా.. ‘పచ్చ’మూకలు రెచ్చిపోయాయి. రాళ్లతో దాడులకు తెగబడ్డాయి. రెడ్డప్ప ఇంటిని చుట్టిముట్టిన టీడీపీ గూండాలు.. మీడియా ప్రతినిధులపైనా రాళ్లతో దాడి చేశారు. రెడ్డప్ప ఇంటి వద్ద టీడీపీ కార్యకర్తలు యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు.