డీఎన్ఏపై దగుల్బాజీ రాజకీయం
తాడేపల్లి: కర్నూలు నగర శివారులోని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ హైస్కూల్ హాస్టల్‌లో 2017 ఆగస్టు 19న సుగాలి ప్రీతి (15) అనే గిరిజన విద్యార్థిని అనుమానాస్పద పరిస్థితిలో మృతి చెందింది. గిరిజన బాలిక మరణిస్తే నాటి టీడీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 2024 ఎన్నికలకు ముందు ఈ గిరిజన కుటుంబం సమస్యను పవన్ కల్యాణ్ రాజకీయం అంశంగా చేసి పదే పదే ప్రస్తావించి వైయస్ జగన్ ప్రభుత్వంపై నిందలు వేసి రాజకీయంగా మైలేజీ పొందేందుకు దగుల్బాజీ ప్రయత్నించారు. అధికారంలోకి రాగినే తొలి సంతకం ప్రీతి కేసు ఫైల్ పై చేస్తానని నమ్మించారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసును పక్కన పెట్టేశారు. వైయస్ జగన్ అప్పట్లో డీఎన్ ఏలు మార్చేశారని తాజాగా తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. 2018 లోనే డీఎన్ఏ మ్యాచ్ కాలేదు అని అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హై కోర్టు తీర్పు ఇచ్చింది. 2018 లోనే తీర్పు వస్తే అప్పటి ముఖ్యమంత్రిని కదా అడగాల్సింది. డీఎన్ఏ 2018 లో వైయస్ జగన్ మార్చారని పవన్ కళ్యాణ్ మతి తప్పి మాట్లాడుతున్నాడు. అంతా తెలిసే ఈ బురద జల్లుతున్నారు. ఈ కేసులో A 2 , A 3 లకు అరెస్ట్ చేసిన రోజునే బెయిల్ వచ్చింది. అదీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉండగా జరిగింది. ఈ విషయాన్ని పవన్ ప్రశ్నించరు. కేవలం చంద్రబాబుకు కొమ్ముకాయడానికే పవన్ ఉన్నారు. స్కూలుకు వెళ్లిన సుగాలి ప్రీతి చనిపోయి ఏళ్లు గడుస్తున్నా దోషులకు శిక్ష పడలేదు. ఇలా ఎన్నేళ్లు మీ మాయ మాటలతో ప్రజలను మోసం చేస్తారు పవనూ అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. నాటి డీఎన్ఏ రిపోర్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో టీడీపీ కూటమి పెయిడ్ బ్యాచ్ తోకముడిచింది.