సీఎం వైయస్ జగన్‌తో టాటా సన్స్ చైర్మన్ భేటీ
21 Sep, 2022 18:46 IST
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డితో టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ భేటీ అయ్యారు. తాడేపల్లిలో సీఎం నివాసంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన టాటా సన్స్ చైర్మన్.. ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై చర్చించారు. ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్దంగా ఉన్నామని, రాష్ట్రంలో పారిశ్రామికంగా అనుసరిస్తున్న పారదర్శక విధానాలను సీఎం వైయస్ జగన్ వివరించారు. సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని సీఎం చెప్పారు. ఈ సమావేశంలో పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల్ వలవెన్, ఏపీఈడీబీ సీఈవో జవ్వాది సుబ్రహ్మణ్యం, సీఎంవో అధికారులు పాల్గొన్నారు.