వైయ‌స్‌ జగన్‌ను కలిసిన తమిళనాడు మంత్రి ఈవీ వేలు 

12 Mar, 2025 22:42 IST

  తాడేపల్లి:  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తమిళనాడు మంత్రి ఈవీ వేలు, ఎంపీ విల్సన్‌ బుధవారం కలిశారు. ఈ నెల 22న చెన్నైలో జరగనున్న దక్షిణ భారత అఖిలపక్ష నాయకుల సమావేశానికి వైయ‌స్‌ జగన్‌ను ఆహ్వానించారు. తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్‌ రాసిన లేఖను వైయ‌స్‌ జగన్‌కు డీఎంకే నేతలు అందజేశారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై చర్చించేందుకు పలు రాష్ట్రాల సీఎంలు, పార్టీ అధినేతలకు సీఎం స్టాలిన్‌ ఆహ్వానం పంపించారు.