కొలికపూడి ఒక కుసంస్కారి
18 Mar, 2024 15:46 IST
విజయవాడ: తిరువూరు టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఒక కుసంస్కారి అని తిరువూరు నియోజకవర్గ వైయస్ఆర్సీపీ అభ్యర్థి స్వామిదాస్ మండిపడ్డారు. కొలికపూడి వ్యాఖ్యలపై స్వామిదాస్ కౌంటర్ ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే..
- ఒక కుహనా మేధావి తిరువూరుకు వచ్చాడు
- రంగా హత్యకు వైఎస్సార్ కారణమని ఓ కుక్క మొరుగుతోంది
- కాపులను రెచ్చగొట్టాలని చూస్తున్నాడు
- కొలికపూడి ఒక కుసంస్కారి
- కుక్క మొరిగినట్లు మొరుగుతున్నాడు
- విద్యార్ధి దశ నుంచే రంగా గురించి నాకు తెలుసు
- రంగా ఒక్క కాపు కులానికి చెందిన వ్యక్తి కాదు.. రంగా అందరి మనిషి
- తిరువూరులో 70 వేల మంది ఎస్సీల్లో చంద్రబాబుకు ఒక్క కార్యకర్త కూడా దొరకలేదా?
- చందాలు వసూలు చేసి వాటాలు పంచుకోవడానికే కొలికపూడిని తిరువూరు పంపించారు
- నేను పక్కా లోకల్.. తిరువూరులోనే పుట్టాను.
- జీవితాంతం తిరువూరులోనే ఉంటాను.
- చంద్రబాబు తన ప్రధాన శత్రువు మోదీతో జీవితంలో కలవనన్నాడు
- ఇప్పుడు తన స్వార్ధం కోసం.. తన కొడుకుని సీఎం చేయడానికి చేతులు కలిపాడు
- ఏం చేశారని మోదీతో చేతులు కలిపాడో చంద్రబాబు సమాధానం చెప్పాలి
- చంద్రబాబు, పవన్ జిమ్మిక్కులను కాపులు నమ్మరు
- సీఎం వైయస్ జగన్‌కు ఓడించడానికి ముగ్గురూ కలిసి వస్తున్నారు
- ముఖ్యమంత్రి వైయస్ జగన్ సింహంలా సింగిల్‌గా వస్తారు
- 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ సభ్యుల్లో సగం బీసీలకు కేటాయించారు
- కాపులకు జగన్మోహన్రెడ్డి ప్రాధాన్యం కల్పించారు
- కాపులను అన్ని విధాలా ప్రోత్సహించిన వ్యక్తి వైయస్ రాజశేఖర్‌రెడ్డి
- కాపులను బిసిల్లో చేర్చాలని రంగా చేసిన పోరాటానికి వైయస్ఆర్ అండగా నిలిచారు
- నన్ను రాజకీయంగా పైకి తీసుకొచ్చిన కుటుంబం వైఎస్సార్ కుటుంబం
- కాపులను మంత్రులు.. ఉపముఖ్యమంత్రి చేసిన వ్యక్తి సీఎం వైయస్ జగన్
- టీడీపీలో ఉన్న కాపులు ఆలోచించాలి
- కాపులకు టీడీపీ ఎప్పుడూ ప్రాధాన్యత ఇవ్వలేదు
- కాపులకు రిజర్వేషన్లు వైయస్ఆర్సీపీతోనే సాధ్యం
- తిరువూరులో నల్లగట్ల స్వానిదాస్కు కాపులు అండగా నిలవాలి
- కాపులకు వైయస్ఆర్సీపీ అండగా ఉందనే విషయం ప్రజల్లోకి తీసుకెళ్లాలి
- రేపట్నుంచే ప్రతీ గ్రామానికీ తిరిగి వైయస్ఆర్సీపీ చేసిన మేలును గుర్తు చేయాలి