చెవిరెడ్డి హర్షిత్ రెడ్డికి ఎస్వీయూ పోలీసుల నోటీసులు

19 Jan, 2026 10:02 IST

తిరుప‌తి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డికి ఎస్వీయూ పోలీసులు నోటీసులు జారీ చేశారు.  ఈ నెల 9న తిరుపతిలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట విద్యార్థి సంఘాలపై పోలీసులు నమోదు చేస్తున్న అక్రమ కేసులు ఎత్తేయాలంటూ ధర్నాలో పాల్గొని మద్దతు తెలిపిన హర్షిత్ రెడ్డి సహా 14 మంది విద్యార్థి సంఘాల నాయకులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఆదివారం రాత్రి ఎస్వీయూ పోలీసులు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డికి నోటీసులు అందజేశారు. పోలీసుల తీరుపై వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.