స్టీల్ ప్లాంట్ ప్రమాదం అత్యంత విషాదకరం
విశాఖ: స్టీల్ ప్లాంట్ ప్రమాదం అత్యంత విషాదకరమని వైయస్ఆర్‌సీపీ ఎంపీ డాక్టర్ తనూజరాణి అన్నారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. రాష్ట్ర ప్రభుత్వం బాధితులను ఆదుకోవాలి. మృతి చెందిన ప్రతి కార్మికుడి కుటుంబానికి రూ. కోటి నష్టపరిహారం అందించడంతో పాటు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి.
ప్రభుత్వం ఆదుకోవాలి
స్టీల్ ప్లాంట్ ప్రమాదం విషాదకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. గాయపడిన వారికి అత్యుత్తమ చికిత్స అందించాలి. ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలి. బాధితులను ఆదుకోవాలి. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు తగిన నష్టపరిహారం అందించాలి.
– కురసాల కన్నబాబు, వైయస్ఆర్‌సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్
దురదృష్టకరం
స్టీల్ ప్లాంట్ ప్రమాదం దురదృష్టకరం. విషాద ఘటన గురించి తెలియగానే ప్లాంట్‌కు చేరుకున్నాం. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు, వారి కుటుంబ సభ్యులను పరామర్శించాం. మృతుల కుటుంబాల వేదన వర్ణనాతీతం. ఆ కుటుంబాలకు రూ.కోటి నష్టపరిహారం ఇవ్వాలి. ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
– కేకే రాజు, గుడివాడ అమర్‌నాథ్, కరణం ధర్మశ్రీ, తిప్పల దేవన్‌రెడ్డి, వైయస్ఆర్‌సీపీ నేతలు