రెడ్ బుక్ రాజ్యాంగం నుంచి బ్లడ్ బుక్ రాజ్యాంగానికి కూటమి పాలన 

2 Feb, 2026 18:39 IST

తాడేపల్లి:  కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మరింత దిగజారి బ్లడ్ బుక్ రాజ్యాంగం నీడలోకి వెళ్లిందని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ అరాచకాలు పరాకాష్టకు చేరాయని, వ్యక్తులపై దాడులు దాటిపోయి ఇప్పుడు ఇళ్లను తగులబెట్టడం, హత్యాయత్నాలకు పాల్పడే స్థాయికి పాలన చేరిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చారని, రాయలసీమలో బలిజలు బలైపోతుంటే, తెలగలు తెగనరకబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది యాదృచ్ఛికం కాదని, పక్కా ప్రణాళికతో జరుగుతున్న సామాజిక అణచివేత రాజకీయమని విమర్శించారు. కాపులంతా ఏకమై తెలుగుదేశం పార్టీని భూస్దాపితం చేయడం ఖాయమని హెచ్చరించారు.  ఇంకా ఏమన్నారంటే...

● కాపు సమాజంపై చారిత్రకంగా దాడులు – తెలుగుదేశం నైజం

నాడు కాపుల్లో బలమైన నాయకుడిగా ఎదుగుతున్న వంగవీటి రంగాను అత్యంత దారుణంగా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వనే హతమార్చింది.కాపులకు న్యాయం చేయాలని ప్రశ్నించిన ముద్రగడ పద్మనాభాన్ని, ఆయన కుటుంబ సభ్యులను ఎలా అవమానించారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు.

● నేటి పాలనలో కూడా కాపు నేతలపై కక్షసాధింపు

నేడు అదే కూటమి ప్రభుత్వ హయాంలో కాపు నేతలు పేర్ని నాని, అంబటి రాంబాబులను రాజకీయ కక్షసాధింపులకు గురిచేస్తున్నారు. చివరకు అధికార టీడీపీలో ఉన్న కందుకూరు నియోజకవర్గం దార్కానిపాడులో కూడా ఒక కాపు నేత బలైపోవడం పరిస్థితి ఎంత దారుణంగా మారిందో చూపుతోంది.

● సీబీఐ రిపోర్టు కాదని – సీబీఎన్ (చంద్రబాబు నాయుడు) రిపోర్టు?

తిరుమల లడ్డూపై సీబీఐ ఇచ్చిన నివేదికను పక్కనపెట్టి, చంద్రబాబు చెప్పిందే నిజమన్నట్లుగా వ్యవహరించడాన్ని ప్రశ్నిస్తే వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై దాడులు చేస్తున్నారు. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందంటూ  మా పార్టీ అధినేత ఫోటోలతో ఫ్లెక్సీలు, హోర్డింగులు పెట్టి అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. 

● అంబటి రాంబాబుపై పక్కా ప్రణాళికతో దాడి

చంద్రబాబు తప్పుడు ప్రచారాన్ని ప్రశ్నించడానికి వెళ్లిన మాజీ మంత్రి అంబటి రాంబాబుపై రాళ్లు, కర్రలతో వందల మంది దాడికి దిగారని అన్నారు. దాడి విజువల్స్ చూస్తే ఇది యాదృచ్ఛికం కాదని, ప్రభుత్వ అండతో జరిగిన పక్కా కుట్ర అని స్పష్టమవుతోంది. బూతుల రాజకీయాలకు పుట్టినిల్లే టీడీపీ. టీడీపీ మహిళా నేత భీమినేని వందనాదేవి నోటి నుంచి వచ్చిన అత్యంత జుగుప్సాకరమైన బూతులు సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. సంస్కారం, అక్షరజ్ఞానం నేర్పాల్సిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా ఇలాంటి వ్యక్తికి పదవి ఇవ్వడమే టీడీపీ సంస్కృతికి నిదర్శనం. మంత్రులు అచ్చన్నాయుడు, అనిత, ఇతర నేతలు వాడిన భాష రాష్ట్ర ప్రజలంతా చూశారు. 

● చంద్రబాబు – లోకేష్ – కూటమి నేతల భాషే అసలు సంస్కృతి?

“నీ అమ్మా మొగుడా” అంటూ చంద్రబాబు, “సైకో జగన్” అంటూ లోకేష్, “రండి రా నా కొడకల్లారా” అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడిన భాష ఏ సంస్కృతికి నిదర్శనం. ఇంత నీచమైన భాష వాడుతూ మళ్లీ నైతికతపై ఉపన్యాసాలు ఇవ్వడం దారుణం. ఎన్నికల్లో గెలవడానికి ఎన్ని అడ్డదార్లు తొక్కడానికైనా సిద్ధపడే చంద్రబాబు బీజేపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీని, ఆయన శ్రీమతిని, తల్లిని కూడా అత్యంత సంస్కారహీనంగా అవమానిస్తూ మాట్లాడారు. అలాంటి బాబు బూతులు, సంస్కారం గురించి మాట్లాడ్డం విచిత్రంగా ఉంది. నోరు తెరిస్తే మహిళలకు గొప్ప గౌరవం ఇచ్చే బాబు బామ్మర్ది, ఎమ్మెల్యే బాలకృష్టది ఇంకా ఘనమైన చరిత్ర. ఆడది కనిపిస్తే ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలన్న గొప్ప గౌరవ వ్యాఖ్యలు చేసిన వ్యక్తి బాలకృష్ణ. కాపులు గురించి ఆయన మాట్లాడిన మాటలు ఇంకా గౌరవప్రదమైనవి.. అలగాజనం చాలామంది పార్టీలు పెడతారు చివరకు మా కాళ్లదగ్గరకే వస్తారన్న బాలకృష్ణ మాటలు విన్న తర్వాతైనా సిగ్గుపడాలి. అసెంబ్లీ సాక్షిగా చిరంజీవి గారిని అవమానిస్తూ మాట్లాడిన రోజు కూడా పవన్ కళ్యాణ్ స్పందించలేదు. 

● కాపులకు  ఒక్క వైయస్ జగన్ వద్దే న్యాయం

కాపు బిడ్డలుగా తమకు న్యాయం వైయస్ జగన్ వద్దే జరుగుతుందన్న నమ్మకం సమాజంలో బలంగా ఉంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో కాపులకు ఉన్న అనుబంధం అందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీ మాత్రం కాపులను మొదటి నుంచీ ఓటు బ్యాంకుగానే చూసింది, అవసరం తీరిపోయిన తర్వాత ఇవాళ వారిపై దాడులకు దిగుతోంది. 

● భూస్థాపితం చేసే వరకు పోరాటం

ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కాపులపై అరాచకాలకు  అడ్డుకట్ట వేయాలని  తరపున హెచ్చరిస్తున్నామని వంగవీటి నరేంద్ర స్పష్టం చేశారు. కాపులంతా ఏకమై పాత రోజులు గుర్తుచేసేలా పోరాడి, ఈ అరాచక రాజకీయాలను భూస్థాపితం చేయడం ఖాయమని వంగవీటి నరేంద్ర స్పష్టం చేశారు.