అర్హులైన ప్రతి నిరుపేదలకు ఇళ్ల పట్టా అందిస్తాం
22 Aug, 2023 16:08 IST
అనంతపురం: అర్హులైన ప్రతి నిరుపేదలకు ఇళ్ల పట్టాలు అందిస్తామని మంత్రి ఉషాశ్రీచరణ్ అన్నారు. మంగళవారం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా అనంతపురం జిల్లా కంబదూరు మండల పరిధిలోని జల్లిపల్లి గ్రామంలో అర్హులైన నిరుపేద లబ్ధిదారులకు ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం లబ్ధిదారులు స్ధానిక నాయకులతో కలిసి సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాల అభిషేకం చేశారు.