ఆరోపణలు చేసి పారిపోయే పిరికిపంద చంద్రబాబు
నెల్లూరు: ఆరోపణలు చేసి పారిపోయే పిరికిపంద చంద్రబాబు అంటూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు నెల్లూరులో నేషనల్ హైవేను ఆనుకుని రా...కదలిరా సభను నిర్వహించారు. చూసిన ప్రతి ఒక్కరూ చంద్రబాబు పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందో, నెల్లూరు జిల్లా చంద్రబాబు గ్రాఫ్ ఎంతగా పడిపోయిందో అర్ధమైందన్నారు. – చంద్రబాబు మాత్రం నాకు ఏక పక్షంగా ఉంది..నా బలం పెరిగింది..నాకు ఓట్లు పెరిగాయి అని చెప్పుకుంటున్నారు. ఆయన కొడుకేమో నేను రెడ్ బుక్‌లో పేర్లు రాసుకుంటున్నాను అంటున్నాడు. ముందు రెడ్ బుక్కులో రాసుకోవాల్సింది చంద్రబాబు పేరు అంటూ ఎద్దేవా చేశారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియాతో ఇంకా ఏం మాట్లాడారంటే:
నెల్లూరు సభతో చంద్రబాబు గ్రాఫ్ పడిపోయిందని ప్రజలకు అర్ధమైంది:
– ఈ రోజు చంద్రబాబు నెల్లూరులో నేషనల్ హైవేను ఆనుకుని రా...కదలిరా సభను నిర్వహించారు.
– చూసిన ప్రతి ఒక్కరూ చంద్రబాబు పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందో, నెల్లూరు జిల్లా చంద్రబాబు గ్రాఫ్ ఎంతగా పడిపోయిందో అర్ధమైంది.
– చంద్రబాబు మాత్రం నాకు ఏక పక్షంగా ఉంది..నా బలం పెరిగింది..నాకు ఓట్లు పెరిగాయి అని చెప్పుకుంటున్నారు.
– ఆయన కొడుకేమో నేను రెడ్ బుక్‌లో పేర్లు రాసుకుంటున్నాను అంటున్నాడు.
– ముందు రెడ్ బుక్కులో రాసుకోవాల్సింది చంద్రబాబు పేరు.
– రామారావు పెట్టిన టీడీపీని చేతులారా బంగాళాఖాతంలో కలిపిన చంద్రబాబు పేరును రెడ్ బుక్‌లో మొదటి పేజీలో తాటికాయంత అక్షరాలతో రాసుకోవాలి.
– నిన్నటి నుంచి లక్షల మందిపైగా జనం అంటూ ఊదరగొట్టారు.
– తీరా చూస్తే నాలుగు వేల కుర్చీలు వేయలేకపోయారు..3 వేల మందిని కూడా తరలించలేకపోయారు.
– వాళ్లు వేసిన కుర్చీలు కూడా చంద్రబాబు మాట్లాడే సమయానికి దాదాపుగా ఖాళీ అయిపోయాయి.
– రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రచారానికి వచ్చిన వ్యక్తి వస్తే ప్రజల స్పందన ఎలా ఉందో అర్ధం చేసుకోవాలి.
– జనం హాజరుకావడం, చంద్రబాబు ఉపన్యాసాన్ని వినడం అనే అంశాలను చూస్తే నెల్లూరు జిల్లాలో 2019 సీన్ రిపీట్ అవుతుంది.
– ఒక్క సీటు కూడా ఆయనకు వచ్చే పరిస్థితి లేదు. అది ఆయనకు అర్ధం అయ్యింది.
– రాష్ట్ర వ్యాప్తంగా అందర్నీ జత చేసి తాను బలంగా రావాలనుకుంటున్నాడు తప్ప ఆయన ఎక్కడా విజయానికి దరిదాపుల్లో కూడా లేడు.
– సభ వెలవెల బోయింది. జనం రాలేదు. అనుకుల మీడియా కూడా ఆ ముందు ఉన్న వంద మంది మాత్రమే చూపించారు.
– ఇక చంద్రబాబు ఉపన్యాసాన్ని కూడా అక్కడికి వచ్చిన వారు ఎలా విన్నారో కూడా ఈ రోజు స్పష్టమైంది.
– సభ అట్టర్ ప్లాప్ అయింది..దాంట్లో రెండో మాట లేదు.
చంద్రబాబుకు సిగ్గూ లజ్జా లేదు కాబట్టే కాళీ కుర్చీలకు ఉపన్యాసం చెప్తున్నాడు:
– జనం రాకపోయినా సరే...చంద్రబాబు తన ప్రసంగంతో కుటిల రాజకీయం మాట్లాడుతున్నాడు.
– ఎవరైనా జనం లేని సభలను ఆపేసి వెళ్లిపోతారు. కానీ చంద్రబాబుకు సిగ్గు లజ్జా ఏమీ లేవు కాబట్టి కాళీ కుర్చీలతో ఉపన్యాసం చేశాడు.
– ఆ ఉపన్యాసంలో తానొస్తే ఏదో చేస్తాను అంటాడు తప్ప ఇప్పటి వరకూ ఏం చేశాడో మాత్రం ఒక్కటీ చెప్పడం లేదు.
– నేను అనేక సందర్భాల్లో చంద్రబాబుకు ఒక చాలెంజ్ విసిరా? నీ పాలనలో వ్యవసాయం ఎలా ఉంది..జగన్ గారి పాలనలో వ్యవసాయం ఎలా ఉందో బహిరంగ చర్చకు రమ్మని పిలిచాం.
– చంద్రబాబు తోకముడిచి పారిపోయాడు..ఈ రోజుకు ఆయన ఆ చాలెంజ్ స్వీకరించలేదు.
– మళ్లీ నెల్లూరు వచ్చి అదే మాట్లాడాడు కాబట్టి..మళ్లీ చాలెంజ్ విసురుతున్నా..
– వ్యవసాయానికి సంబంధించి కూలంకుషంగా చర్చించడానికి మేం సిద్ధంగా ఉన్నాం.
– సమయం, తేదీ, వేదిక ఖరారు చేస్తే ఎక్కడకైనా వచ్చి రైతుల ముందే కూర్చుని మాట్లాడదాం.
– ఆయన వస్తాడని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే మాట్లాడి పారిపోయే పిరికిపంద చంద్రబాబు.
– ధైర్యంగా నిలబడి ఇది చేశాను అని చెప్పుకోలేని బాబు రైతుల మధ్య, మా ముందు నిలబడి మాట్లాడే దమ్ము ధైర్యం ఆయనకు లేదు.
– నీ హాయంలో విత్తనాలు ఇవ్వాలంటే రైతులు క్యూలు కట్టి గుండెపోటుతో చనిపోయిన పరిస్థితి. ఆనాడు వారిపై నువ్వు లాఠీచార్జి చేయించిన పరిస్థితి.
– మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేరుగా రైతుభరోసా కేంద్రం వద్దే విత్తనాలు ఇస్తున్నాం. రైతు ముంగిటే మేం విత్తనాలు అందిస్తున్నాం.
– నీ హయాంలో ఎరువులపై సరైన విధానం లేక రైతులకు అధిక ధరలకు అమ్మారు. దానిపై చంద్రబాబుకు నియంత్రణ లేదు.
– రేటు కంటే వంద, 150 రూపాయలు అధికంగా అమ్మి..రశీదు లేకుండా అమ్మారు.
– కాంప్లెక్స్ ఎరువులు కొంటేనే యూరియా, డీఏపీ ఇస్తాను అన్నారు. దాన్ని కూడా కంట్రోల్ చేయలేకపోయావు.
– ఈ రోజు ఎరువులను రైతులు ఆర్బీకేకి వెళ్లి కియోస్క్‌లో ఆర్డర్ చేసుకుంటున్నాడు. ఐదు రోజుల లోపుగా వారికి ఎరువులు అందుతున్నాయి.
– తుపాను అగే లోపుగా రైతులు నేరుగా ఇంట్లోంచి బయటకు వచ్చే లోపుగా వారికి విత్తనాలు పెట్టాం. 90 శాతం సబ్సిడీతో విత్తనాలు అందించాం.
– ఉచిత పంటల బీమా ఇస్తున్నాం..మీ జన్మలో ఉచిత పంటల బీమా ఇచ్చి రైతులను ఆదుకోవాలనే అలోచన వచ్చిందా?
– రైతులు ఒక్క రూపాయి ప్రీమియం చెల్లించకుండా మొత్తం ప్రభుత్వమే భరించి రైతులకు ఉచిత పంటల బీమా ద్వారా రక్షణ కల్పిస్తున్నది జగన్ గారు.
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకూ బకాయిలు పెట్టి వెళ్లిన నీచుడు చంద్రబాబు:
– నేను చాలెంజ్ విసురుతున్నా..గిట్టుబాటు ధర లేకుండా చేతులెత్తేసింది నువ్వు కాదా?
– ధాన్యం కొనుగోలు కేంద్రాలు అసలు తెరవలేకపోయావు..కొనుగోలుపై కోటా విధించావు.
– మొక్కుబడిగా ధాన్యం కొనుగోలు చేశాం అని చెప్పుకోడానికి చేశావు తప్ప రైతులకు మేలు జరగలేదు.
– నేడు ఆర్బీకేల నుంచే ధాన్యాన్ని సేకరిస్తున్నాం. రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చి తీరాల్సిందే అని చెప్పిందో అప్పుడే వ్యాపారుల్లో మార్పు వచ్చింది. ధరలు పెరిగాయి.
– నెల్లూరు జిల్లాలో ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధర కంటే 20 శాతం అధిక ధరకు రైతులు అమ్ముకోగలిగారు.
– చంద్రబాబు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయదు...రైతులకు అండగా నిలవదు కాబట్టి రైతుల్ని మోసం చేయవచ్చని కొందరు వ్యాపారులు భావించారు.
– అప్పుడున్న వ్యవసాయ శాఖ మంత్రి వ్యాపారులకు వచ్చిన లాభంలో పది రూపాయలు నాకివ్వండి అని దండుకున్నారు.
– మీ హయాంలో రైతులు ఎంతగా కుమిలిపోయారో..కన్నీళ్ల పర్యంతం అయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
– నేడు తడిసిన, రంగు మారిన ధాన్యం కొనుగోలు చేసి వెంటనే చెల్లింపులు చేసేలా చర్యలు తీసుకున్నాం.
– విపత్తుల వల్ల పంట నష్టం జరిగితే సీజన్ ముగిసే లోపుగానే వారికి నష్టపరిహారం ఇచ్చేలా ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకున్నారు.
– చంద్రబాబు నోరు కంప్పు..వళ్లు కంపు..మనసూ కంపు..మనిషి కంపు.
– చంద్రబాబు రైతులకు ఏదో చేశానని చెప్పడానికి కనీసం బుదై్దనా ఉండాలి.
– రైతులకు చెల్లించాల్సిన బీమా నీ అవసరాలకు వాడుకున్నది వాస్తవం కాదా?
– నువ్వు దిగపోయేనాటికి వేల కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ బకాయిలు పెట్టి వెళ్లింది వాస్తవం కాదా?
– రూ 5లక్షల విలువైన ట్రాక్టర్‌ను రూ.6 లక్షల ధర పెంచి..ఎవరి దగ్గర కొనాలో ఎంతకు కొనాలో కూడా నువ్వే నిర్ణయించావు.
– నాలుగున్న లక్ష రైతుతో కట్టించి...ఒకటిన్నర లక్ష సబ్సిడీ అంటూ దాంట్లో లక్ష కొట్టేశావు.
– వారికి బిల్లులు చెల్లించకుండా వెళ్లిపోతే వాళ్లు కోర్టులకు వెళ్లారు. ఆ డబ్బు రైతురథం కింద జగన్ గారు వచ్చిన తర్వాత చెల్లించారు.
– డ్రిప్ ఇరిగేషన్ కింద చంద్రబాబు దాదాపు రూ.వెయ్యి కోట్లు బకాయిపెట్టారు.
– నీ వల్ల చిన్న చిన్న కంపెనీలు మూతపడితే జగన్ గారు వచ్చిన తర్వాత ఆ వెయ్యి కోట్లు ఇచ్చి మళ్లీ ప్రారంభించారు.
– రైతులు చనిపోతే రూ.5 లక్షలు చెల్లించాల్సింది బకాయిలు పెట్టి వెళ్లిపోయిన నీచుడువి నువ్వు.
– రైతులు ఆత్మహత్య చేసుకుని ఆ కుటుంబాలు బాధ పడుతుంటే చంద్రబాబు ఆ కుటుంబాలను అనాథలుగా వదిలేశాడు.
– జగన్ గారు వచ్చిన తర్వాత ఆ కుటుంబాలను పునఃవిచారించి బకాయిలతో పాటు చెల్లించి అండగా నిలిచారు.
– ఉచిత విద్యుత్ గురించి మాట్లాడే అర్హత నీకు అసలు ఉందా?
– నీ వల్ల డిస్కంలు కుప్పకూలిపోయాయి. వేల కోట్ల బకాయిలు పెట్టి వెళ్లిపోయావు.
– జగన్ గారు వచ్చిన తర్వాత నువ్వు ఎగ్గొట్టిన వేల కోట్ల బకాయిలు చెల్లించారు.
– దీనితో పాటు న్యాణమైన విద్యుత్‌ను రైతులకు అందించేందుకు 33 కేవీ సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు పెంచారు.
– నీ పాపాలు ఎక్కడ రైతుల పాలిట శాపాలుగా మారతాయోనని వాటిని కడిగి ప్రక్షాళన చేసిన వ్యక్తి జగన్ గారు.
ఆక్వా రంగానికి రూ.1.50కి విద్యుత్ నువ్విచ్చేదేంటి నీ బొంద..? ఆల్‌రెడీ జగన్ గారు ఇస్తున్నారుగా..?:
– అక్వాకు నువ్వు రూపాయిన్నరకు విద్యుత్ ఇస్తాననడానికి నీకు అసలు బుద్ధుందా?
– నెల్లూరు జిల్లాలో 2019లో తుపాను వస్తే అక్వా రైతులు నిన్ను కనీసం విద్యుత్ టారిఫ్ రాయితీ అడిగితే ఇస్తాను అని చెప్పి ఎగ్గొట్టిన వ్యక్తి చంద్రబాబు.
– నువ్వు ఏ మాత్రం రైతుల పట్ల కనికరం లేని వాడివి.
– వైయస్ జగన్ గారు ఎప్పుడైతే రూపాయిన్నరకే విద్యుత్ ఇస్తానంటే తాను రెండు రూపాయలకు ఇస్తానని చంద్రబాబు చెప్పాడు. ఎన్నికలకు రెండు నెలల ముందు రెండు రూపాయలు చేశాడు.
– మేం వచ్చిన తర్వాత రూపాయిన్నరకు విద్యుత్ ఇస్తున్నాం. గతంలో ఎక్కువ కట్టిన వారుంటే దాన్ని సర్ధుబాటు చేసిన ఘనత వైయస్ జగన్ గారిదే.
– ఆక్వా రంగానికి రూపాయిన్నరకే విద్యుత్ ఇస్తాను అని కొత్తగా నువ్వు చెప్పేది ఏంటి నీ బొంద..?
– అల్ రెడీ జగన్ గారు రూపాయిన్నరకు ఇస్తుంటే నువ్వు నిర్ణయం తీసుకునేది ఏంటి?
– నీ జీవితంలో ఏ రోజైనా ఒక్క కొత్త పథకం తీసుకొచ్చావా?
– జగన్ గారు అమ్మ ఒడికి రూ.15 వేలు ఇస్తే..నేనూ ఇస్తాను అంటాడు. రైతు భరోసా ఇస్తే నేనూ ఇస్తా అంటున్నాడు.
– అసలు నువ్వు గతంలో ఇచ్చిన రైతు రుణమాఫీ హామీ అమలు చేశావా?
– మేం చెప్పింది రూ.12,500 రైతు భరోసా ఇస్తాం అన్నాం. రూ.ఋ13,500 ఇస్తున్నాం.
– నీలా చెప్పిమోసం చేయలేదు జగన్ గారు..చెప్పినదానికన్నా ఎక్కువగా గర్వంగా ఇస్తున్నాం.
– వ్యవసాయ రంగం గురించి నువ్వు మాట్లాడటం ఆకాశంపై ఉమ్మేయడమే. రైతులు నీమీద ఉమ్మేస్తారు గుర్తుంచుకో.
– రైతుల గురించి మాట్లాడే అర్హత..రైతు, వ్యవసాయం అనే పదాలను కూడా ఉచ్చరించే అర్హత చంద్రబాబుకు లేదు.
తట్ట మట్టి వేయకుండా ప్రాజెక్టులన్నీ నేనే చేశానంటే జనం పిచ్చోళ్లా?:
– 2015లో వరదలు వచ్చి..నెల్లూరు–చెన్నై జాతీయ రహదారికి గండిపడితే 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వు మరమ్మతులు చేయలేని చరిత్ర హీనుడివి నువ్వు.
– వైయస్ జగన్ గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే కేంద్రంతో మాట్లాడి వెంటనే నిధులు మంజూరు చేయించి పనులు చేయించారు.
– సర్వేపల్లి రిజర్వాయర్ కొట్టుకుపోయే పరిస్థితి వచ్చిందని మీ నాయకులు చెప్తే..ఒక్క రూపాయి పెట్టి దాన్ని రిపేరు చేయించలేదు.
– ఎన్నికల ముందు జీవో ఇచ్చి అట్టహాసంగా శంకుస్థాపన చేసి వెళ్లిపోయాడు.
– మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పనులు ప్రారంభించాం.
– వైయస్ జగన్ గారి పాదం జలపాదం. రైతులు రెండు పంటలు పండించుకుంటున్నారు.
– సంగం, నెల్లూరు బ్యారేజీల పెండింగ్ పనులకు ఎందుకు నువ్వు నిధులివ్వలేకపోయావు..?
– వైయస్ రాజశేఖరరెడ్డి గారు ఈ లోకం నుంచి వెళ్లిపోయిన తర్వాత నీతో సహా ఎవరూ పట్టించుకోలేదు.
– వైయస్ జగన్ గారు వచ్చిన తర్వాత నిధులిచ్చి పూర్తి చేసి దాన్ని ప్రారంభిస్తే 70 శాతం మేమే చేశాం అంటాడు.
– కృష్ణపట్నం పోర్టు వారు కంటైనర్ టెర్మినల్ మూసే పరిస్థితి లేదు..ఇంకా విస్తరించే ఆలోచనలు చేస్తున్నాం అని చెప్తున్నారు.
– మేం ఎవరికి మెయిల్స్ పెట్టలేదు అని అధికారకంగా వివరించారు.
– లేనటువంటి దాన్ని ఉన్నట్లుగా నీచరాజకీయాలు చేస్తున్నారు.
నీ ముఖం, అందం చూడటానికి కనీసం వంద మంది కూడా రాలేదు:
– నేను జనాన్ని బ్రహ్మాండంగా తరలిస్తానంటే చంద్రబాబు ట్రాన్స్‌పోర్ట్‌కు సోమిరెడ్డికి కోటిరూపాయలు ఇచ్చాడు.
– ఆ కోటి రూపాయలు జేబులో వేసుకున్నారు. అతని మొహం చూసి జిల్లాలో వచ్చేవారు ఎవరున్నారు..?
– ఈ రోజు నీ సభ ఎంత పేలవంగా జరిగింది..నిన్న జనం గారు సిద్ధం సభ పెడితే జనం ఎలా వచ్చారో చూడు.
– గతంలో జగన్ గారు పెట్టిన స్థలంలోనే నేడు చంద్రబాబు సభ పెట్టాడు.ఆనాడు జాతీయ రహదారిపై కూడా జనం వేలాది మంది నిలిచిపోయారు.
– ఈ రోజు నీ ముఖం, నీ అందం చూడటానికి కనీసం వందమంది కూడా లేరు.
– ఈ దుస్థితి చూసిన తర్వాత నేరుగా ఇక టీడీపీ అధ్యక్షుడిగా కొనసాగదలచుకోలేదు అని చెప్పి వెళ్లిపోవాలి.
– 2024తో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కనుమరుగవ్వడం ఖాయం.
– నీకు మళ్లీ సవాల్ విసురుతున్నా..నీకు ధైర్యం ఉంటే చర్చకు రా.
– చంద్రబాబు బీసీలకు ఓడిపోయే సీట్లుంటే ఇచ్చేవాడు.
– ఇప్పుడు అలా కాదు సామాజిక సమతుల్యతతో జగన్ గారు అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు.
– ఆయన తీసుకునే నిర్ణయానికి మేమంతా బద్ధులుగా ఉంటాం.
– పోటీ చేయమన్నా, ఒకరికి సహకరించాలి అన్నా దానికి మేం సిద్ధం.
– పొత్తులోనే పొద్దుపోని వీళ్లు రేపు ప్రజలకు ఏం సేవ చేస్తారు..?
– తాను గెలవాలనే ఆలోచన పవన్ కల్యాణ్‌కు లేదు..
– నా పార్టీని ఫణంగా పెటై్టనా వైయస్ జగన్ గారిని ఓడిస్తా..చంద్రబాబును గెలిపిస్తా అంటున్నాడు.
– ఆ లక్ష్యంతో పనిచేసే వారు అందరూ కలిసి వచ్చినా గెలవరు.
– ప్రజలే మా స్టార్ క్యాపెంనర్లు. చంద్రబాబు సభలు చూసిన తర్వాత బాబుకు ఓటేసేవాడు కూడా ఇక వేయడు.
– ఆమె ఆలోచన విధానాన్ని చూస్తే నాకు అనిపించింది చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేయాలనే.
– అన్ని పార్టీలు ఎలా కలిశాయో ఆమె కూడా వారితో గళం కలుపుతోంది.
– చంద్రబాబును గెలిపించాలని అనుకుంటే నేరుగా పురందేశ్వరిలా చంద్రబాబుతో జతకట్టొచ్చు.